రైతులు ప్రత్యమ్నాయ పంటలపై దృష్టిసారించాలి

0
రైతులు ప్రత్యమ్నాయ పంటలపై దృష్టిసారించాలి
ఎంపిపి శ్రీ వుట్కూరివెంకటరమణారెడ్డి గారు
పెద్దలింగపూర్ క్లస్టర్ పరిధి లో పంట మార్పిడి విధానం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవఎంపిపి శ్రీ వుట్కూరివెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే యాసంగి కాలంలో వరి పంటకి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిం చారు.వచ్చే యాసంగి కాలం లో ప్రభుత్వం దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయదని ముందుగానే రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
 వరికి బదులు మొక్కజొన్న,శనగ,వేరుశనగ,నువ్వులు,చిరు ధాన్యాలు, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయాలని సూచించారు.  ఉద్యాన వన పంటలైన అయిల్ పాల్మ్ సాగు వివరాలను మండల ఉద్యాన వన అధికారిని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీ గొడిశేలజింతేందర్  గారు,స్థానికఎంపిటిసి  కరివేదస్వప్న కర్ణాకర్ రెడ్డి,  ఏఓసందీప్ గారు,జిల్లా రైతు బందు సమితి సభ్యులు మాధవ రెడ్డి,మండల రైతుబందు కో ఆర్డినేటర్ చెరుకుపల్లి రాజిరెడ్డి ,మండల ఉద్యాన వన అధికారిని , అనంతరం సర్పంచ్ చల్ల నారాయణ, తిప్పపూర్ ధమ్మని లక్ష్మీ, రామోజీపేట పెండ్యాల మేఘావ్వ, చిక్కుడువనిపల్లి లాల రాధ, క్లస్టర్ లోని అన్ని గ్రామల రైతు బందు సమితి కో ఆర్డినేటర్ లు ,ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త మధన్ మోహన్ ,మండల వ్యవసాయ అధికారి సందీప్,వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష,రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top