వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన జడ్పీ వైస్ చైర్మన్

0
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన జడ్పీ వైస్ చైర్మన్
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువాణిపల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్  సిద్దం వేణు  మాట్లాడుతూ రైతుల ప్రయోజన కోసమే గ్రామాలలో వరి.దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు.
కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి అని 
రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు,ప్రజాప్రతినిధులు పని చేయాలి అని అన్నారు.రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5,000/- రూపాయల చొప్పున రైతుబంధు డబ్బులు జమ చేయడం జరుగుతుందని అలాగే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే  ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని  ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని అన్నారు.
 కార్యక్రమంలో  సర్పంచ్  లాల రాధ రమేష్, ఎంపీటీసీ తీగల పుష్పాలత మార్కెట్ కమిటీ సభ్యులు వొల్లాల వెంకటేష్ గుండా శ్రీనివాస రెడ్డి ఉపసర్పంచ్ రమేష్ మొండయ్య సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top