రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

0
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో  బిజెపి మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో  బిజెపి మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి హుజురాబాద్ ఎన్నికలు పూర్తయ్యేవరకు దళిత బంధు స్కీము ఆపివేయాలని కోరడంతో కమిషన్ దళిత బందును కేవలం ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మీకు తెరాస ప్రభుత్వ ముఖ్యమంత్రికి తెలియదా అందుకు కారణం బిజెపి అని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనటం విడ్డూరంగా ఉందని దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఎన్నికల కోడ్ వుంటుందని ఆ కోడ్ వున్నప్పుడు ఎలాంటి ఆర్థిక పరమైన మంజూరు చేయరాదని టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు తెలుసుకోవాలని అన్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎందుకు ఇవ్వలేదు చెప్పాలన్నారు కొద్దిమంది అకౌంట్లో డబ్బులు వేసి ఆ అకౌంట్లను ఎందుకు స్తంభింప చేశారని కెసిఆర్ చెప్పాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బందు అనే పథకాన్ని తీసుకువచ్చామని స్వయంగా కేసీఆర్ ఏ చెప్పాడు కాబట్టి హుజురాబాద్ లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నందున దళితులకు ఆశచూపి హుజురాబాద్ ఎన్నికల్లో గెలవాలనే దళితుల్ని మరోసారి మోసం చేయాలని ఈ పథకాన్ని తీసుకు వచ్చారని రాష్ట్ర ప్రజలకు తెలుసునని అంతేగాని దళితులకు 10 లక్షలు ఇవ్వాలని లేదు అని అందుకే హడావుడిగా ఈ డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. దళితులు ఏవిధంగా కెసిఆర్ గారిని నమ్మాలో చెప్పాలి దళితుణ్ణి ముఖ్య మంత్రి చేస్తా అని చెప్పి చెయ్యనందుక, దళితులకు మూడెకారల భూమి పంపిణి చెయ్యనందుకా అని నిలదీశారు. దళితులకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాంఅని ఇవ్వనందుకా అంటూ మండిపడినారు, దళితులకు వెంటనే మూడు ఎకరాల భూమి, డబుల్ బెదరూము ఇండ్లు, దళిత బందు 10 లక్షలు రూపాయలు అందించాలని ,అసత్య ప్రచారాలు మానుకోవాలని, బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ, హుజురాబాద్ ఎన్నికల్లో  TRS  పార్టీ కి ప్రజలు తాగిన గుణపాఠం చేప్తారన్నారు, మండల ఉపాధ్యక్షులు బోయిని రంజిత్,పున్ని సంపత్, ప్రధానకార్యదర్శిలు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజు,పట్టణ అధ్యక్షుడు తిప్పరాపు .శ్రవణ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న,ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి వజ్జేపల్లి శ్రీకాంత్,చుక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top