రైతుల ప్రయోజన కోసమే గ్రామాలలో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

0
రైతుల ప్రయోజన కోసమే గ్రామాలలో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతు 👳‍♀️ను రాజు గ చూడాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి కేసీ ఆర్ గారి లక్ష్యం
రసమయి బాలకిషన్

ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూర్,కందికట్కూర్,గాలిపెల్లి,తాళ్లపెల్లి,ముస్కానిపేట,ఇల్లంతకుంట,వెంకట్రావుపల్లె,సోమారంపేట,రేపాక గ్రామాలలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట సాంస్కృతిక సారథి చైర్మెన్, గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు  శ్రీ రసమయి బాలకిషన్  గారు

అనంతరం రసమయి  గారు మాట్లాడుతూ రైతుల ప్రయోజన కోసమే గ్రామాలలో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు.
కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి అని 
రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు,ప్రజాప్రతినిధులు పని చేయాలి అని అన్నారు.రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5,000/- రూపాయల చొప్పున రైతుబంధు డబ్బులు జమ చేయడం జరుగుతుందని అలాగే రైతులకు 24గంటల ఉచిత 💡విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top