సామాజిక విప్లవానికి తెలంగాణలో తొలి అడుగు దళిత బంధు
గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల TRS పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రం లోని బస్టాండ్ వద్ద కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ పార్టీ హుజురాబాద్ లో దళితబంధు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘంతో చెప్పి,నిలిపివేసినందుకు నిరసనగా బీజేపీ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
అనంతరం TRS పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ పల్లె నర్సింహారెడ్డి గార్లు మాట్లాడుతూ
సామాజిక విప్లవానికి తెలంగాణలో తొలి అడుగు ధళిత బంధు అని
భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పటిమ గొప్పదని అయితే అనేక వివక్షతల మూలంగా సామూహిక ఐక్యత ఆశించినంతగా లేక పోవడం వల్ల సామాజిక అభివృద్ధి ఆశించినంతగా జరుగట్లేదని అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావు గారు "దళిత బంధు పథకాన్ని" ప్రవేశపెట్టారని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారు మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి,తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించి అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారని అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారని,తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన 'సింహ గర్జన' సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన 'రైతు బీమా' పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారని అన్నారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన 'రైతుబంధు' పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారని,అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటును కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుండే ప్రారంభించారని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకున్నారని,ఆ తర్వాత నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేసారని అన్నారు. ఇందులో బాగంగ హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేసినారని అన్నారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరి పూర్ణస్థాయిలో వర్తింప చేస్తే అది చూసి ఓర్వలేక కండ్లు మండి ఎక్కడ ఓడిపోతామో అని భయంతో కేంద్రంలో అధికారంలో ఉన్న BJP పార్టీ హుజురాబాద్ లో "దళిత బంధు" పథకం నిలిపివేసిందని అన్నారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజ్,కేతిరెడ్డి అనసూయ వెంకట నర్సింహారెడ్డి,MPTC లు గొట్టిపర్తి పర్షరాం, సావనపెల్లి వనజ అనిల్,మండల ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు MD సాదుల్,AMC డైరెక్టర్ లు రాగటి రమేష్, దోంతుల శంకర్,కో ఆప్షన్ సభ్యులు MD.సలీం, TRS మండల యూత్ అధ్యక్షులు బుర్ర సూర్య గౌడ్, SC సెల్ మండల అధ్యక్షులు పసుల బాబు, మైనార్టీ అధ్యక్షులు MD.ఉస్మాన్, మాజీ సర్పంచ్ మామిడి సంజీవ్,TRS పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు,ఉప సర్పంచ్ లు గోజ గాని కిషన్, గుండేటి ప్రశాంత్,దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు పసుల బాల్ రాజ్,TRS సీనియర్ నాయకులు తెలంగాణ శ్రీను, భాస్కర్,కాసుపాక రాములు,ఎలుక రాజయ్య, జానార్ధన్, కేషవేని శ్రీనివాస్, రాములు,లింగంపెల్లి బాబు,గౌతం,జక్కుల నాగరాజు TRS పార్టీ మండల నాయకులు అన్ని సంఘాల డైరెక్టర్లు,TRS పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు