నేరరహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలి
ప్రతి ఒక్కరూ నేరరహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని మండల పారా లీగల్ అడ్వైజర్ తంగాలపెళ్ళి వెంకట్ గారు అన్నారు, ఈ రోజు మండలలోని ముస్కానింపేట, అరేపల్లి, రేపాక, సోమరంపేట, వెంకట్రావుపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నుంచే నేర నియంత్రణ ఉండాలని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల నిరుపేదలు కోర్టుకు వచ్చి న్యాయం కొరకు పోరాడే స్థోమత లేదన్నారు. అలాంటివారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని ఆశ్రయిస్తే న్యాయం పొందే అవకాశం ఉందని సూచించారు. ప్రతిఒక్కరూ చట్టాల గురించి తెలుసుకుంటే నేరాలు, దొంగతనాలు, హింస తగ్గుముఖం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, మహిళలు, రైతులు న్యాయవాదులు కడగండ్ల తిరుపతి, కృష్ణ,మండల పారా లీగల్ వాలంటరీస్ సునీత, వసంత, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.