మహాత్ముని సాధన కోసం కృషి చేయాలి
ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి గారు
దేశ స్వాతంత్ర్యం కోసం శాంతి మార్గాన్ని ఎంచుకుని , హింసకు తావివ్వకుండా అహింసనే ఆయుధంగా చేసుకున్న మహనీయుడు, మహాత్మగాంధీ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి గార అన్నారు. శనివారం మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో మహాత్మ గాంధీ గారి జయంతి సంధర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ, సూపరిండెంట్ నర్సింహారెడ్డి, ఎంపిఓ జోగం రాజు, డైరెక్టర్ కొమురయ్య, మల్లుగారి దేవెందర్ రెడ్డి, యాసతిరుపతి, ధనూజ్ , ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.