దళిత మోర్చా ఆధ్వర్యంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మ దహనం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో ఈరోజు
- దేశ ప్రధాని మోడీ గారిపై, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పై అనుచిత వ్యాఖ్యల చేసిన ఎమ్మెల్యే రసమయి బహిరంగ క్షేమాపణ చెప్పాలని: బిజిపి నాయకుల డిమాండ్
టిఆర్ఎస్ ధర్నాలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరియు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గార్ల పైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు మాట్లాడిన తీరును ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు నాయకులు తెలిపారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బాడకౌ వాడికి ఏం తెలుసు వడ్ల గురించి గోధుమలు తినటొడుకదా అని అంటూ అసభ్యకరంగా మాట్లాడతు బండి సంజయ్ గారు మోడీ గారి పెంపుడు కుక్క అని చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మహానుభావుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని దుర్భాషలాడటం సమంజసం కాదు తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు బండి సంజయ్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో రాం ఉన్నటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎలుక రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, నాయకులు సొల్లు ప్రశాంత్, చింటూ, వర్ధన్, బత్తిని స్వామి, తిప్పారపు శ్రావణ్, చాల్లురి భాను, పున్ని రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.