బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్లా జిల్లా ZP వైస్ చైర్మేన్ సిద్దం వేణు గారు

0
ఈ రోజు ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో బొడ్రాయి 🔘 ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్లా జిల్లా ZP వైస్ చైర్మేన్ *శ్రీ సిద్దం వేణు* గారు...
▪️అనంతరం *సిద్దం వేణు* గారు మాట్లాడుతూ ఎక్కడే గాని ఊరును కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు సబ్బండ వర్ణాల కుల పెద్దలందరూ కలిసి ఆయా పరిసర ప్రాంతంలో ఉన్న పీఠాధిపతిని కలిసి వారి సూచనల మేరకు అనుభవజ్ఞులైన శాస్త్ర పండితుల పర్యవేక్షణలో ఊరు మద్యల బొడ్రాయిని నిర్మిస్తారని అన్నారు.
గ్రామ పొలిమేరలలో ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది స్త్రీ మూర్తి దేవతలు ఆధిపత్యం వహిస్తూ ఉంటారని గ్రామ పొలిమేరలను ఈ ఎనిమిది మంది దేవతలు అక్కచెల్లెళ్ళు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు, ఈ ఎనిమిది మంది పొలిమేర దేవతలకు అధిదేవత శీతలాదేవి అమ్మవారు గ్రామ ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి బొడ్డు రాయి క్రింద శీతాలాదేవి అమ్మవారి యంత్రం స్థాపితం చేస్తారుని అన్నారు. ఇలా ఈ బొడ్రాయి అంటే ఒక్క విగ్రహమని కాదు. స్త్రీ, పురుష దేవతా స్వరూపమై, సమస్త దేవతల సమాహారంగా మారి, శక్తి వంతమైన తేజస్సుతో గ్రామం మధ్య నుండి ఎనిమిది దిక్కులలో విస్తరించి ఎల్లప్పుడూ గ్రామానికి రక్షణగా నిలుస్తుంది ఈ బొడ్డురాయి దేవత అని అన్నారు..
▪️ఈ కార్యక్రమంలో PACS చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి, స్థానిక సర్పంచ్ TRS పార్టీ మండల అధ్యక్షులు పల్లె నర్సింహరెడ్డి,MPTC గొట్టి పర్తి పర్శరాంలు గౌడ్,ఉప సర్పంచ్ బుర్ర బాలకిషన్,PACS డైరెక్టర్ పల్లె సృజన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ అంజయ్య గౌడ్,నాయకులు KVN రెడ్డి, బాలగౌడ్,రమణా రెడ్డి,తది తరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top