పందుల బెడద ను నివారిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
డిసెంబర్.12/21....రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో ఈరోజు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు మ్యాకల మల్లేశం మాట్లాడుతూ అయ్యా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు ఊరి లో పందుల బెడద అలానే ఉంది మీరు హామీ ఇచ్చి రెండు నెలలు అవుతుంది ఊరిలో ఒక్క పంది కనబడకూడదని అన్నారు. వారికి మేకలు కొని ఇచ్చి ఉపాధి కలిపిస్తా అన్నారు.ఇప్పటికి ఏం జరుగలేదు ఊరిలో పందులు అలాగే తిరుగుతున్నాయి.మన జిల్లా కేంద్రంలో ఒక్క పందికూడా తిరగకుండా మన మంత్రి గారు వాళ్లకు ఉపాధి కలిపించారు.మీరు కూడా తొందరగా వాల్లకు ఉపాధి కలిపించి ఇచ్చిన మాట నిలపెట్టుకోవలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగు రమేష్,దోనపటి సంపత్,చెంద్రం, తదితరులు పాల్గొన్నారు