ఘనంగా శ్రీ అటల్ బీహారి వాజ్ పేయి గారి జయంతి వేడుకలు
ఇల్లంతకుంట మండలకేంద్రంలో మాజీ భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బీహారి వాజ్ పేయి గారి 97 జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించి పండ్ల పంపిణీ చేస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ శ్రీ అటల్ బీహారి వాజ్ పేయి గారు మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ పట్టణం లోని మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబలో 25 డిసెంబర్ 1924 సం లో కృష్ణదేవి కృష్ణదేవి బీహారి గార్లకి జన్మించినారు,1944 ఆర్యాసమాజ్ ప్రధాన కార్యదర్శి గా నా
పనిచేసారు.బీజేపీ తరుపున ప్రధాన మంత్రి పదవి పొందిన నాయకుడు,మొదటి నుండి పదనాలుగు లోక్ సభ వరకు 3,9 వ రెండు సార్లు మినహా పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించిరన్నారు,రెండు సార్లు రాజ్య సభకి ఎన్నికయ్యారు,1968 నుండి1973 వరకు జనసంఘ్ పార్టీ కి అధ్యక్షులు గా పనిచేసారన్నారు,1980-1986 వరకు బీజేపీ అధ్యక్షులు గా పనిచేసారు.1998-2004 వరకు ప్రధాన మంత్రి గా వున్నారన్నారు.అలుపెరుగని రాజకీయ నాయకుడిగా పోరాటం చేసి 1994 లో ఉత్తమ పార్లమెంటిరియన్ అవార్డు పొందినారన్నారు,తను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 12 మర్చి 2015 సం లో భారత రత్న ప్రకటించి, 2015మార్చ్ 27 నా స్వయంగా రాష్ట్రపతి గారే స్వయంగా ఇంటికి వెళ్లి అవార్డు అందచేశారన్నారు,తన పుట్టినరోజునీ సూపరిపాలన దినోత్సవం గా భారత ప్రభుత్వం ప్రకటించినదన్నారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం శ్రీ అటల్ జీ గారి ఆశయాలను నెరవేర్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి నాగసముద్రల సంతోష్, బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్, గడ్డమిది వినయ్, శ్రీనివాస్ పాలుగోన్నారు.