రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ జిల్లాలోని వన్యప్రాణుల సంఘర్షణకు పరిష్కారం ఎలా?....
ఇటీవల వన్య ప్రాణులు ఆవాసాలు, ఆహారం కోల్పోవడం వాళ్ళ అడవికి అనుకోని ఉన్న గ్రామాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అందువలన ఒంటరిగా గ్రామాల్లో ఉండే పశువుల పై దాడి చేయడం జరుగుతుంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల లోని పలు మండలాల్లో వన్య ప్రాణుల వాళ్ళ పశువులకు - వన్య ప్రాణుల మధ్య సంఘర్షణ లో పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది . అదే విధంగా పశువులపై సంఘర్షణ ఎలాంటి సందర్భం లో ఇ వన్యప్రాణులు దాడి చేస్తున్నవి అని శాస్త్ర పద్దతులతో పరిశోధన చేస్తే ఇ సంఘర్షణ మూలలను
తెలుసుకోవచ్చు.
ప్రాథమికంగా ఈ కారణాలు ఒంటరిగా పశువులను , లేగ దుడాలను , జాలి ( నెట్ ) లేకుండా , ఇంటికి దూరంగా కట్టివేయడం, నిర్మానుష్య ప్రాంతాల్లో కట్టివేయడం వంటివి ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. రానున్న రోజులలో ఈ సంఘర్షణలకు కారణమయ్యో వణ్యప్రాణిని
కచ్చితంగ గుర్తించడానికి , డిఎన్ఏ ఆధారిత పరీక్ష కోసం కరీంనగర్ - ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహాయం తో CCMB - LaCONES lab కి సాంపిల్స్ పంపించి ఆ వన్య ప్రాణిని గుర్తించడానికి కృషి చేస్తాం....
పాడిరైతులకు సలహాలు :
1. లేగ దుడాలను ఇంటికి దగ్గర లో కట్టివేయాలి, నిర్మానుష ప్రాంతాల్లో, ఒంటరిగా వీటిని ఉంచకూడదు. ఎల్లపుడు జాలి లో ఉంచి , జంతువుల నుండి రక్షించాలి .
2,. గ్రామాల్లో ఉండే గ్రామ అధికారులు గ్రామాల్లో సంచారించె వన్య ప్రాణుల గురించి ఎప్పటికప్పుడు గ్రామా ప్రజలకు అవగాహన కల్పించాలి.
2. మీమీగ్రామాలలో ఏదయినా కొత్త జంతువు(తోడెలు,కోండ్రిగాడు,(చారలహైన) , అడవిపిల్లి , చిరుత , ఎలుగుబంతి మొదలైనవి కనబడితే , మీగ్రామ సర్పంచ్ మరియు స్థానిక ఫారెస్ట్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలి.
3. వన్య ప్రాణులను సంరక్షించడం, వాటి పట్ల అవగాహన , ప్రేమ , గౌరవం ఉంచడం మన సంస్కృతి లో భాగం,వణ్యప్రాణుల చట్టం ప్రకారం వెటాడటం,హని తలపెట్టడం నేరం కావున వాటిని ఫారెస్ట్ విభాగం తో పాటుగా ప్రజలందరూ వాటి రక్షణకు పాటుపడాలి.
సిరిపురం శ్రీనివాస్,
ccmb - lacones lab వైల్డ్ లైఫ్ పరిశోధకుడు
కరీంనగర్ జిల్లా.
---------------- End news -------------------------
మీ బిసినెస్ ని కేవలం 1000 రూపాయలతో నెల ఈరోజు ప్రమోట్ చేసుకోండి.
సెల్ :9490217612