అడిగిన వెంటనే స్పందించి వంటగ్యాస్ అందించిన సర్పంచ్

0



ఈ రోజు ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శించి పాఠశాలలోని  సమస్యల గురించి తెలుసుకోగా, మధ్యాన భోజనం కట్టెల పొయ్యి మీద వంటచేయడం వల్ల వచ్చే పొగతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని వంటమనిషి తెలియజేయడంతో తక్షణమే స్పందించి వంటగ్యాస్ ను అందించడం జరిగింది,పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేసి సర్పంచ్ గారికీ  కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మండల రైతుబంధు అధ్యక్షులు చేరుకుపెల్లి రాజిరెడ్డి,  అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షులు తడుకపెల్లి భూమయ్య, వార్డుసభ్యులు నలువాల రాజు యాదవ్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బోల్గమ్ నర్సయ్య గౌడ్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు దుద్దెడ రాజు గౌడ్, ఉపాధ్యాయులు అశోక్, మాధవి గార్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top