రేపాక క్లస్టర్ పరిధిలో అవగాహన సదస్సు

0
రేపాక క్లస్టర్ పరిధిలో అవగాహన సదస్సు
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్


➖ రేపాక క్లస్టర్ పరిధిలో అవగాహన సదస్సు
ఈరోజు 06/12/2021 న గొల్లపల్లి, వెంకట్రావు పల్లి, రేపాక గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ వ్యవసాయ అధికారి గారు రవళి ఆధ్వర్యంలో  యాసంగి 2021-22 లో పంట మార్పిడి వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా  యాసంగి కాలంలో FCI/GOI వాళ్లు వరి పంటను కొనుగోలు చేయo అని చెప్పి నందున మరియు వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండవు అని అంటున్న నేపథ్యంలో  రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటల పంటలైన మినుము ,పెసర్లు ,నువ్వుల పంట సాగు పై దృష్టి సారించాలని వివరించడం జరిగినది.ఇందులో భాగంగా...
• *మినుము పంటను*(నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు ) PU-31,LBG-752,LBG-20 రకాలను వేసుకోవచ్చు. విత్తన మోతాదు 6-8 Kgs.దిగుబడి సుమారు 5 నుంచి 6 క్వింటాళ్ల /ఎకరం వరకు ఉంటుంది.
• *పెసర పంట* (నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు)
MGG295,WGG37, WGG42 రకాలు. విత్తన మోతాదు 6-8kgs/acre.దిగుబడి సుమారు 4 to 6 క్వింటాళ్ల ఉంటుంది.
• *నువ్వులు* (జనవరి 15 నుండి  ఫిబ్రవరి 15) శ్వేత ,హిమ,JCS 1020 రకాలు. విత్తన మోతాదు 2 to 2.5 kgs/acre. దిగుబడి సుమారుగా 2-3 క్వింటాళ్ల వరకు వస్తుంది. అను మొదలగు అంశాలను వివరిస్తూ ఇందుకు సంబంధించినటువంటి కరపత్రాలను మరియు పంట యాజమాన్య పుస్తకాల లు పుస్తకాలను రైతులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  AMC మాజీ డైరెక్టర్ కడగగండ్ల తిరుపతి రైతులు గుర్రం తిరుపతి రెడ్డి, గునిరెడ్డి, శ్రీను తిరుపతి రెడ్డి మల్లయ్య పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top