ఇల్లంతకుంట మండలంలోని క్రైస్తవ సోదరిసోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకటరమణా రెడ్డి తెలిపారు. జవారిపేట చర్చి కి వెళ్లి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని, క్రిస్టియన్ ల సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు శాంతిని కొరుకోవాలని, అందరం కలసి మెలసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మెంబర్ మాధవ రెడ్డి ,మాజీ ఎంపిపి శ్రీ ఐలయ్య యాదవ్ ,టిఆర్ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ మంకాల బాబు ,ఉప సర్పంచ్ ఎర్ర భూపతి ,గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంద్ మరియు సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.