ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలపై మండల పార్టీ అధ్యక్షులు పసుల వెంకట మాట్లాడుతూ రైతులను రాజుల చేస్తా అన్న కేసీఆర్ మాటలు బుట్టదాఖలు అని తేలిపోయింది . వానకాలం వడ్లు మొత్తానికి ఇంకా కళ్ళల్లోనే ఉన్నాయ్ వేసంగి వడ్ల కొరకు కొట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ తోడుదొంగలు వీళ్లు రాజకీయం నడుపుకోవడానికి ఆడుతున్న డ్రామాలు తప్ప రైతులకు మేలు చేసే విధానాలు వీళ్లిద్దరు దగ్గర లేవు రైతులను రోడ్ల మీదికి తేవడమే తప్ప ఇద్దరూ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండి వాళ్ల మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్లు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉండి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు ప్రజలు అందరూ ఏకమై కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం ఏ రోజు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ప్రజలకు రైతులకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ప్రజలు భావిస్తున్నారు గనుక రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం బిజెపి టిఆర్ఎస్ రెండు ఒకటే ఢిల్లీలో దోస్తీ గల్లీ లొల్లి అన్నట్టు ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప వేరేది ఏమి లేదు ఇట్టి రెండు పార్టీలను ప్రజలు గ్రహిస్తున్నారు రాబోయే రోజుల్లో చరమగీతం పాడుట ఖాయం . మండలములో కూడా నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాగా ఇక్కడ మాఫియా లో ఒక్కటి రాజకీయాలలో వేరు అనే విదంగా ప్రజలను తప్పుదోవ పట్టించడము జరుగుతుంది అని ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి తో పాటు ఇల్లంతకుంట మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు mohd జమాల్ పాల్గొన్నారు.