_రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో నాబార్డు వారి సహకారంతో తో ఐ ఆర్ డి ఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మగ్గం వర్క్ శిక్షణలో పాల్గొంటున్న 35 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
అనంతరం వారు స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ గారి మగ్గం వర్క్ కు_ _సంబందించి స్టాండ్ లు అవసరం ఉన్నది అని అడుగగానే ఆయన వెంటనే స్పందించి హైదరాబాద్ నుండి 35మంది మహిళలకు సుమారు 23,000/-రూ!!ల విలువగల మగ్గం వర్క్ స్టాండ్ లు అలాగే వారికి నేర్పించిన ట్రైనర్ కి తులం వెండి అందజేసినారు.అనంతరం సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ కి మగ్గం వర్క్ నేర్చుకున్న మహిలళు మరియు గ్రామస్థులు అభినందించి సన్మానం చేసినారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న కరుణాకర్ రెడ్డి ,ఉప సర్పంచ్ కొమురయ్య PACS డైరెక్టర్ వసంత లు పాల్గొని సర్టిఫికెట్ లు అందజేశారు .స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కె.రాజలింగం ప్రోగ్రాం కోఆర్డినేటర్ బాలకృష్ణ ట్రైనర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------
ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి మీకు స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716.