డబుల్ బెడ్ రూమ్ ల వద్ద వాటర్ ట్యాంక్ భూమిపూజ

0


ఇల్లంతకుంట వార్తలు:
ఈ రోజు ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామంలో డబుల్ బెడ్  రూమ్ ల వద్ద వాటర్ ట్యాంక్ కు భూమిపూజ చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మన్  సిద్దం వేణు ,అనంతరం  మాట్లాడుతూ తెలంగాణయంగ్ డైనమిక్ రాష్ట్రఐటి మంత్రి   కె టి రామారావు ,తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్  మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్  సహాకారంతో పేదల చిరకాలవాంఛైన డబుల్ బెడ్ రూం ల గృహ ప్రవేశం త్వరలోనే చేపట్టి... నిరుపేదలకు నీడనందిస్తామని అన్నారు. పేద కుటుంబానికి స్వంత ఇంటి కల నిజం చేసేందుకు  ముఖ్యమంత్రి  కేసీఆర్ గారు డబుల్ బెడ్ రూం పథకాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు
స్థానిక సర్పంచ్ సిద్దం శ్రీనివాస్,MPTC పట్నం అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ ,బండారి పర్శరాములు,PACS డైరెక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి,వార్డ్ సభ్యులు, TRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కదురు శేఖర్ ,గుంటి అంజి,రాజు,కరుణాకర్,మహేందర్, శ్రీనివాస్,సతీష్,  గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top