బొల్లం సాయిరెడ్డి. మండల్ రిపోర్టార్
ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుబందు వారోత్సవాల పేరిట సంబరాలు జరుపుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా రోడ్డు పై బైఠాయించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకట్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దళితులను మరోసారి మోసం చేయడానికి దళితబందు పథకాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రైతుబందు వారోత్సవాలు జరుపుతున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే నిజంగానే మానకొండూర్ నియోజకవర్గ దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి తో కొట్లాడి మన నియోజకవర్గం లో అమలు చేయించాలి అన్నారు.లేని పక్షంలో నియోజకవర్గం లో ఎక్కడ పర్యటన జరిగిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అడ్డుకుంటారు అని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు జమాల్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జుట్టు నగేష్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెరేళ్ల విజయ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజు సంతోష్ కుమార్, మండల కార్యదర్శి రజినీకాంత్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాయిని సుకుమార్, న్యాత బాబు,మామిడి నరేష్, కుంటాల శేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు రమేష్,ముత్యాల మల్లారెడ్డి,దాసరి పర్సయ్య,రాజయ్య,పర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------------
ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి మీకు స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716.