ఇల్లంతకుంట వార్తలు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్క పేట గ్రామంలో నిన్న రాత్రి శ్రీ కనక దుర్గ దేవి గుడి గేటు ఉన్న తాళం పగలగొట్టి గుడిలో ఉన్న హుండి పగులగొట్టి డబ్బులు కానుకలు తీసుకువెలినారు. అన్ని ఈరోజు ఇల్లంతకుంట మండలం లో పోలీస్ స్టేషన్ లో.ఎస్ ఐ. కీ కంప్లైంట్ చేయడం జరిగింది.
గుడి పూజారి ఇచ్చిన సమాచారం ప్రకారం 24వ తారీఖు రోజున పూజ చేసి గుడి గేటుకు తాళం వేసి వచ్చానని 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గుడికి వెళ్లగా తాళం పగులగొట్టి ఉన్నది. హుండీ తాళం పగులగొట్టి హుండీలో డబ్బులు దోచుకెళ్లారని ఫోన్ ద్వారా సమాచారం అందుకుని గుడి కమిటీ అధ్యక్షుడు మరియు గుడి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ కలిసి వెళ్లి పరిశీలించారు.