హిమంతను సమాజం నుంచి బహిష్కరించాలి

0


అస్సాం సీఎం వ్యాఖ్యలు దేశ సంస్కృతిపై దాడి

దేశానికి అందిస్తున్న బిజెపి భావజాలం ఇదేనా..?

అస్సాం సీఎంపై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు 

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి


 దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ మనుమడు ఎంపి రాహుల్ గాంధీ పైన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాక్యాలు
ప్రపంచ దేశాలు ఆరాధించే దేశ సంస్కృతి, గౌరవించే కుటుంబ వ్యవస్థను అవమానపరిచే విధంగా ఉన్నందున ఆ సీఎంను సమాజం నుంచే  బహిష్కరించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి అన్నారు. దేశ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థపై దాడి చేసే విధంగా నీచమైన వ్యాక్యాలు చేసిన హిమంతకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికతలేదన్నారు. వెంటనే ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం స్పందించి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు వారి పార్టీ నుంచి, ఈసమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 
ఫిర్యాదు చేసిన కార్యక్రమంలో మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ బీసీ సెల్  జిల్లా ప్రధానకార్యదర్శి నేరేళ్ళ విజయ్ గౌడ్ ,మైనర్టీ అధ్యక్షులు జమాల్ బిసి సేల్ అధ్యక్షుడు తాట్ల వీరేశం, యస్ సి సేల్ మండల అధ్యక్షుడు బడుగులింగం,యసి సి సేల్ జిల్లా కన్వీనర్ జుట్టు నగేష్, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ , మండల కాంగ్రెస్ ఉపాద్యక్షులు నరేందర్ రెడ్డి ,ముత్యాల మల్లరెడ్డి, రమణ రెడ్డి,కొలపురి అంతగిరి, రాజమల్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top