పౌరహక్కుల దినోత్సవము

0



రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తుార్ గ్రామంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కలిసి మెలసి ఉండాలని, కులవివక్షతో వ్యవహరించవద్దని సూచించారు. పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా
భారతదేశం నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ
నా మార్గదర్శకం
స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనే సూక్తి
నాకు స్ఫూర్తిదాయకం
అంటరానితనం కులవివక్ష ద్వేషం దౌర్జన్యం లాంటి భావాలకు నా మనస్సు నుండి తొలగిస్తున్నాను
కలసి ఉంటే కలదు సుఖం మరియు గెలుపు అనే భావనను
నేను తు చ తప్పకుండా పాటిస్తాను
సమత, మమతలకు నెలవైన నా తెలంగాణాణతల్లి సాక్షిగా
మానవత్వాన్ని మనస్సునిండా నింపుకొని ప్రేమగా సమాజం పట్ల భాద్యతగా మెలుగుతానని
ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేయించారు.  
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జోగం రాజు, ఆర్ఐ సంతోష్ , ఏఎస్ఐ మోతీలాల్,సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎంపీటీసీ మొత్తం అశ్విని శ్రీనివాస్, ఉపసర్పంచ్ బండారు పరుశురాం గౌడ్, PSCS డైరెక్టర్ చెరకు శ్రీనివాసరెడ్డి,కదురు శేఖర్ మహేందర్ సతీష్ గుంటి మధు,వీఆర్వో,కార్యదర్శి,వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top