ఈ నెల 27న ఆదివారం నిర్వహించబోయో పల్స్ పోలీయో కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో పల్స్ పోలీయో పై అధికారులతో, సంబంధిత సిబ్బందిపై అవగాహన కల్పించారు. ఈ సంధర్బంగా ఆయా గ్రామాలలో సర్పంచులు,ఎంపిటిసిల పర్యవేక్షణలో వైధ్య సిబ్బంది, అంగన్ వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు వేయాలని సూచించారు. నూతనంగా ప్రభుత్వ ఆస్పత్రి వైధ్యుడిగా భాద్యతలు చేపట్టిన డాక్టర్ రమేష్ ఎంపిపిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బావుసింగ్, ఎంపిడిఓ జోగం రాజు, డాక్టర్ రమేష్, ఎపిఎంవాణిశ్రీ, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, సిబ్బంది పాల్గొన్నారు.