ఒగ్గర ముత్యం BJYM రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( సెల్ : 9392548716)
నూతన పింఛన్లు మంజూరు చేయడంతో ప్రభుత్వం తీవ్ర జాప్యం వహిస్తుందని BJYM రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఒగ్గర ముత్యం అన్నారు. ముత్యం మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుండి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ,గీత,నేత కార్మికులు, ఒంటరి మహిళలు ఆసరా పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా నూతన పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోందని, వెంటనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని లేని ఎడల భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.