ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ సెల్ 9392548716
పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు,పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనగా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో TRS పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి అధ్యక్షతన మండల కేంద్రంలోని వారసంత నుండి బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలు దరించి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఆవరణలో నరెంద్ర మోడి దిష్టి బొమ్మ దగ్దం చేసినారు.ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు ముఖ్య అథిగా హజరైనారు. అనంతరం సిద్దం వేణు మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంటే, ప్రధాన మంత్రి మోడి చూసి ఓర్వలేకపోతుండని అన్నారు.ప్రధాని మోడి తెలంగాణ ప్రజలను అవమానించారని అన్నారు.
విభజన హామీలను మోడీ నెరవేర్చకపోవడం తీవ్ర విచారకరం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడిన తీరు చాలా బాదకరం అని అన్నారు.
విద్యార్థి అమరవీరుల త్యాగం, సబ్బండ వర్గాల రాజీలేని పోరాటంతో సాధించుకున్న తెలంగాణ ప్రజలను మోడీ ఘోరంగా అవమానించారని అన్నారు.కొత్తగా ఏర్పడిన తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ను మించి అన్ని రంగాలలో ప్రగతిపథాన దూసుకు పోతుండడాన్ని చూసి ఓర్వలేకపోతుండని అన్నారు.ప్రధాని విభజన హామీలను నెరవేర్చకపోగా, తెలంగాణపై ఈవిధంగా విషం చిమ్మడాన్ని ప్రజలుజీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు MPTC లు,ఉప సర్పంచ్ లు,అన్ని సంఘాల అధ్యక్షులు,TRSపార్టీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.