ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఊట్కూరి వెంకటరమణ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు 2022- 2023 సంవత్సరము కొరకు సబ్కి యోజన సభ్గా వికాస్ ప్లాన్ కొరకు మండలంలోని వివిధ శాఖల అధికారుల నుండి నివేదికలు తెప్పించుకుని నివేదికల పైన చర్చించడము జరిగింది. మరియు ఇట్టి కార్యక్రమంలో గౌరవ మండల పరిషత్ వైస్ చైర్మన్ మరియు గౌరవ ఎం.పి.టి.సి.సభ్యులు మరియు కో ఆప్షన్ సభ్యులు మరియు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది.