ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ :
ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో రాజన్న సిరిసిల్లా జిల్లా ZP చైర్మేన్ అరుణా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన టీఎస్-ప్రైడ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు
అనంతరం సిద్దం వేణు గారు మాట్లాడుతూ
ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సబ్సిడీ యూనిట్లను సద్వినియోగం చేసుకొవాలి అని అన్నారు.టీఎస్-ప్రైడ్ సబ్సిడీ పథకం క్రింద ఎస్సి, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రవాణా వాహనాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ పథకం క్రింద ప్రభుత్వం పురుషులకు 35%శాతం, స్త్రీలకు 45%శాతం సబ్సిడీ అందజేస్తుందన్నారు. శనివారం సమావేశంలో 28 మంది ఎస్సి అభ్యర్థులకు 80 లక్షల 56 వేల రూపాయలు, 17 మంది ఎస్టీ అభ్యర్థులకు 49 లక్షల 70 వేల రూపాయలు సబ్సిడీ మంజూరు అయినవి అని అన్నారు. సబ్సిడీ యూనిట్లలో ట్రాక్టర్ విత్ ట్రాలీ, ట్రాక్టర్ విత్ డౌజర్, మోటార్ క్యాబ్స్, గూడ్స్ క్యారీయేజ్ తదితర వాహనాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధితోపాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.