పెద్దలింగపూర్ లో మహిళా దినోత్సవ వేడుకలు

0

మహిళా దినోత్సవంను పురష్కరించుకొని ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్  గొడిశెల జితెందర్ గౌడ్, స్థానిక ఎంపీటీసీ కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి ,PACS డైరెక్టర్ గన్నేరం వసంత నర్సయ్య,గారిని ఆశాలను,అంగన్వడి టీచర్లను,V.O.A.లను,V.O అధ్యక్షురాలుని,గ్రామ పంచాయాతీ సపాయి కార్మికులను,వార్డు సభ్యులను,ఘనంగా సన్మానించి చీరెలు పంఫణీ చేసినారు.అనంతరం గొడిశెల జితెందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం మహిళలు, బాలి కల అభివృద్ధి, భద్రతకు  పెద్దపీట వేస్తోందన్నారు.  స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించిందన్నారు. బాలిక లకు ఉచిత విద్యతోపాటు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలతో అభివృద్ధికి బాటలు వేస్తోంద న్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముం దుకు వెళ్లినపుడే ఉన్నత శిఖరాలు అధిరో హిస్తారన్నారు.  ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ మహిళలు ఉన్నారని, వారి పాత్ర  కీలకంగా మారిందని అన్నారు. స్వయం ఉపాధి కల్పన రంగాలతోపాటు వ్యాపార రంగాల్లోనూ ఎద గాలని ఆకాంక్షించారు. శాస్త్ర సాంకేతిక రం గాల అభివృద్ధిని అందిపుచ్చుకొని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,PACS డైరెక్టర్  గన్నేరం వసంత నర్సయ్య,
ఉప సర్పంచ్ కుమార్  యాదవ్,వార్డు సభ్యులు ఆశాలు,అంగన్వడి_ _టీచర్లు,V.O.A.లు,V.O అధ్యక్షురాలు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top