టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి తరలిరండి
- మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్ల కొనుగోలు వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు రేపు నిర్వహించే మానకొండూర్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు.
ఈరోజు మద్యాహ్నం మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో కరీంనగర్ సుడా ఛైర్మెన్ మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ.జీవి.రామకృష్ణారావు తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేపు ఉదయం: 10.00 గంటలకు తిమ్మాపూర్ మండలం అల్గునూర్లోని శ్రీ.లక్ష్మీనర్సిహ్మ గార్డెన్లో సమావేశం ప్రారంభమవుతుందన్నారు
మానకొండూర్ నియోజకవర్గంలోని MPPలు, ZPTC లు, అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, MPTC లు, ఉప సర్పంచులు, TRS పార్టీ గ్రామశాఖ, మండల శాఖ అధ్యక్షులు, రైతు బంధు, సింగిల్విండో, మార్కెట్ కమిటీ, TRSV, SC సెల్, ST సెల్, BC సెల్, మాజీ ప్రజాప్రతినిధులు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే రసమయి కోరారు.