ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామం లో సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ తాపీ మేస్త్రీ ల సమావేశం లో సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామం లో ఎక్కడ ఇండ్ల నిర్మాణం గానీ ప్రహారి గోడల నిర్మాణం గానీ చేసినప్పుడు రోడ్లకు 5ఫీట్లు వదిలి నిర్మాణ పనులు చేయాలి అని, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణాలు చేయవద్దు అని సూచించారు అదే విధంగా గ్రామ పంచాయతీ మురికి కాలువలపైన ,సి సి రోడ్ల పై ఎలాంటి నిర్మాణాలు చేయరాదు అని చెప్పారు .ఈ కార్యక్రమంలో ఎంపిటిసి స్వప్న కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రంజిత్, మేస్త్రీ సంఘం అధ్యక్షులు పసుల చిన్న రాములు సంఘం సభ్యులు దేవయ్య, ప్రవీణ్, శ్రీనివాస్,పర్షరాములు, ఎల్లయ్య, కొమురయ్య, దేవరాజు, కిషన్, పోచయ్య,మధు,రాజు, రాయమల్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.