రెండు రోజుల ఇల్లంతకుంట మండల పర్యటనలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ మండలంలోని గాలిపల్లి గ్రామాల్లో అంగాన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,మరియు పౌరసరఫరాల దుకాణాలను తనిఖీ నిర్వహించి ఆహార భద్రత చట్టం గ్రామాల్లో అమలు అవతున్న తీరును నేరుగా పరిశీలించి, లోపాలను గుర్తించడం జరిగింది తరువాత పెద్దలింగాపూర్ గ్రామ సభలో
పాల్గొన్నారు. రేపు మండల కేంద్రంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్ఒ, సిడిపివో, డిపిఓ, స్థానిక వైద్యాధికారి, ఎమ్మార్వో,M.E.O,A.S.O,స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, ప్రజలు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.