ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthkunta.in
మానకొండూరు మండలం శంషాబాద్ గ్రామం వద్ద కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనగ రెండు కార్లలో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
శంకరపట్నం మండల పర్యటన ముగించుకుని రాత్రి 10:00 సమయంలో తిరిగి కరీంనగర్ వెళుతుండగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ పరిస్థితిని గమనించి స్థానిక పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉండి వారికి మనోధైర్యాన్ని కల్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.