కేంద్ర ప్రభుత్వ మే వడ్లు కొనుగోలు చేయాలని తీర్మానం
కేంద్ర ప్రభుత్వ మే వడ్లు కొనుగోలు చేయాలని తీర్మాణ పత్రాన్ని రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్ శ సిద్దం వేణు కి అందజేసిన ఇల్లంతకుంట మండల రైతుబంధు సమితి.
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ని రైతు వేదిక లో మండల రైతు బంధు సమితి అధ్యక్షులు
చెరుకుపెల్లి రాజిరెడ్డి అన్ని గ్రామాల అధ్యక్షులతో సమావేశం ఎర్పాటుచేయగ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు హజరుకాగ వారికి తెలంగాణలో రబీ వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మాణం చేసి సిద్దం వేణు కి అందజేసినారు.
సిద్దం వేణు మాట్లాడుతూ తెలంగాణలో ఏసంగిలో అధిక ఉష్ణోగ్రత వల్ల బియ్యంపగిలిపోయి.నూకలు ఎక్కవ వస్తాయి.కనుక ఏసంగిపంటలో 40%శాతం బియ్యం, 60%శాతం నూకలు వస్తాయి. రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన పంటనంతా సేకరించాల్సిన బాధ్యత ఎఫ్.సి.ఐ.పై ఉంటుంది. భారతదేశ వ్యవసాయ దేశం కాబట్టి రైతు పండించిన పంటనంతా కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.
ఎప్పుడూ లేని సమస్య ఈసారే ఎందుకు వచ్చిందే ఆలోచించాలలి అని అన్నారు. పంజాబ్ లో వానాకాలం రా రైస్ తీసుకోవడంతో పాటు, ఏసంగిలో గోదుమలు తీసుకుంటున్నారు. వాళ్లు ఏ పంట పండిస్తే ఆ పంట తీసుకుంటున్నప్పుడు, మన దగ్గర కూడా అదేవిధంగా తీసుకోవాలని అన్నారు.
బౌగోళికంగా మన దగ్గరున్న వాతావరణాన్ని పట్టి ఏసంగిలో బాయిల్డ్ కు అనుకూలంగా ఉండే రైసు మాత్రమే పండుతుందని అన్నారు.
బాయిల్డ్ రైస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని మాకు ఈసారి బాయిల్డ్ రైస్ వద్దని కేంద్రం 2021లో ఏసంగిలో మనకు లేఖ రాసిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ,రైతు బంధు సమితి మండల అధ్యక్షులు చెరుకుపెల్లి రాజిరెడ్డి,రైతు బంధు జిల్లా నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు, గజ్జెల రాజశేకర్,ఈదుల రవిందర్ రెడ్డి,కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,బత్తని మల్లయ్య,కంకణాల శ్రీనివాస్ రెడ్డి,మేకల శ్రీనివాస్ యాదవ్,దేవెందర్,బాస్కర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.