ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, సరియైన సౌకర్యాలు అందుబాటులో రోగులకు ఇబ్బందులు
జంగంరెడ్డిపల్లె గ్రామ శివారులో ఉదయం 5:20 గం.సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ వచ్చి పడిపోగా పెట్రోల్ నిర్వహిస్తున్న ఏఎస్సై వెంకటేశ్వర రెడ్డి, తమ సిబ్బంది గమనించి ఆ వ్యక్తిని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ వ్యక్తికి ఫీట్స్ వచ్చి శ్వాస కూడా సరిగా తీసుకొనే పరిస్థితిలో ఉండగా సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు సంతోష్ అక్కడికి చేరుకొని ఆ వ్యక్తికి సేవలు అందించారు. కాగా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కోసం పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేక, వైద్య సిబ్బంది, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో దాదాపు గంటన్నర సేపు ఆ వ్యక్తి తీవ్ర అవస్థలు పడ్డాడు. చివరిగా వైద్య సిబ్బంది వచ్చినప్పటికీ వైద్యం అందించుటకు సరియైన సౌకర్యాలు లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి లో పడ్డారు. ఇంతలో అంబులెన్స్ రావడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేకపోవడంతో ఏఎస్సై వెంకటేశ్వర్ రెడ్డి చొరవతో గుర్తు తెలియని వ్యక్తిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించిన యువకులు సంతోష్, సవనపెల్లి అనిల్, నరేందర్, అంబులెన్స్ సిబ్బంది రాజశేఖర్ లను ఏఎస్సై అభినందించారు.