KTR పై చీటింగ్ కేసు నమోదు చేయగలరని పిర్యాదు

0


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్ లో జిల్లా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారిపై చీటింగ్ కేసు పిర్యాదు చేసిన బెంద్రం.తిరుపతిరెడ్డి
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి  మంజూరుచేస్తానని   జిల్లా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  తేది 16-05-2018 నాడు హామీ ఇచ్చి నేటి రోజుకి 46 నెలలు గడిచిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు ఇవ్వకుండా ఇల్లంతకుంట మండల ప్రజలను మోసం చేయడంతో  మండల భారతీయ జనతా పార్టీ నాయకులందరు బస్టాండ్ నుండి ర్యాలీగా 30 పడకల ఆసుపత్రి హామీ నెరవేర్చాలని నినాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఇల్లంతకుంట  కి  పిర్యాదు చేసిన బెంద్రం.తిరుపతి రెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ... 

ఇల్లంతకుంట మండల ప్రజలకి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చి KTR మమ్మల్ని మోసం చేసాడని ప్రజలకు మెరుగైన ఉచిత  వైద్యం అందక వందలాది మంది ప్రజల ప్రాణాలు  పోవడానికి కారణమైనా KTR  మళ్ళీ రెండవ సారి తేది 19-04-2021 నాడు ఇల్లంతకుంట సభలో  జిల్లా అధికారుల,ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల సమక్షంలో త్వరలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసినందున KTR  పై చీటింగ్ కేసు నమోదు చేయగలరని పిర్యాదు చేసినమన్నారు, ప్రజలందరికి చట్టం ప్రజలందరికి సమానమనే పిర్యాదు చేసాము ఒకవేళ KTR  పై  SI FIR చేయకపోతే, చట్టం కల్వకుంట్ల తారకరామారావు చుట్టామనే అనుకోవాలిసివస్తుందన్నారు. న్యాయస్తానని అశ్రాయించాలసిన అవసరం కలగనివ్వరిని అనుకుంటున్నామన్నారు

.వీరి వెంట చెప్యాల.గంగాధర్, గజ్జల శ్రీనివాస్, బోయిని రంజిత్, దండవేణి రజినీకాంత్, బత్తిని స్వామి, నాగసముద్రాల.సంతోష్,దామేర.కృష్ణ, మామిడి హరీష్, సూదుల.కిషన్, మెడిపెల్లి.శ్రవణ్ రెడ్డి, సుదగోనీ.శ్రీకాంత్, దామ. శేఖర్,  అంతటి వేణు, దూది. సుదీర్ రెడ్డి, బొల్లపెల్లి రాజిరెడ్డి, మామిడి.అనిల్, గాండ్ల అనిల్, పయ్యావుల.నవీన్, కీర్తి.రాజ్, కుమ్మరివేణి.మహేందర్,కట్నపెల్లి.రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, బోటిమిదిపల్లి.మహేష్,, అక్షయ్ వున్నరు.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top