ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో SFI (భారత విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఉపాధ్యక్షుడు మంద అనిల్ కుమార్ రావటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. గతంలో మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయ్యాలని ధర్నా, ర్యాలి, నిరాహార దీక్షలు చెయ్యటం, మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా చేస్తే 6మంది sfi నాయకులపై కేసులు పెట్టిరన్నారు. అదే విధంగా రేపక, సోమరాంపేట, వెంకట్రావు పల్లె,పెద్దలింగపూర్, అనంతగిరి,వెలజిపూర్,వల్లంపట్ల గ్రామ బస్సు సౌకర్యం కల్పించాలని బస్టాండ్ ఆవరణలో ధర్నా చేస్తే బస్సులు వేసరన్నారు.
KGBV పాఠశాల లో నీటి కొరత ఉందని deo మరియు మండల ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లగా బోరు వెయ్యటం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యన భోజనం అమలు చెయ్యాలని నిరసన కార్యక్రమాలు చేపట్టగా గత సం"లో ప్రజాప్రతినిధులు నిధులతో భోజనం పెట్టించారు. కరీంనగర్ లో ఉన్నా సంక్షేమ గురుకుల పాఠశాల ను ఇల్లంతకుంటాకు మార్చాలని, పక్క భవనం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తే మౌలిక వసతులు ఉన్న అద్దె భవనం ఏర్పాటు చెయ్యటం జరిగింది అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని,కార్పొరేట్ విద్య సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిచ్చామన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియబర్స్ మెంట్ విడుదల చేయాలని నిరసనలు చెయ్యటం. మండలంలో విద్యార్థులకు సమస్యలపై ఉద్యమించిందన్నారు. భవిష్యత్తు లో కూడా నూతన కమిటీతో విద్యార్థుల కోసం సమస్యలు పరిష్కారం కొరకై పోరాడే విధంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. మండల నూతన కార్యదర్శి గా సొల్లు సాయి కుమార్,అధ్యక్షుడు జంపాల అక్షయ్, ఉపాధ్యక్షుడు జోగు అరవింద్,సూరు అభిషేక్,పసుపుణుటి అజయ్,గల్ల్స్ కన్వీనర్ గా మంద అనూష,తడకపెల్లి రేఖ,నీలిమ,అఖిల,లిఖిత,అను,ఎద్దు వెంకటేష్,మామిడి పవన్, కడగండ్ల వినిత్,రడం సుమిత్ sfi కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.