ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన ఎండ్ర బాబు గత వారం రోజుల క్రితం మరణించగ ఈ రోజు వారికుటుంబానికి ఎండ్ర బాబు స్నేహితులు,TRS పార్టీ శ్రేణులు 1లక్షా మూడు వేల రూపాయలను రాజన్న సిరిసిల్లా జిల్లా ZP వైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు ఆద్వర్యంలో ఆయన చేతుల మీదుగ వారికి అందజేశారు.
సిద్దం వేణు ఎండ్ర బాబు చిత్రపటానికి పూల మాల వేసి నివాలు అర్పించి అనంతరం వారు మాట్లాడుతూ ఎండ్రబాబు కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది అని TRS పార్టీ శ్రేణులు మిత్రులు గమనించి వారికి సహయం చేయడం అభినందనీయమని అన్నారు.ఎండ్ర బాబు కుటుంబ పరిస్థితి గురించి తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకవెళ్లామని వారు వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ,వారికి ఇల్లు మంజూరి చేస్తామని అన్నారని అన్నారు.తక్షణ సహాయం క్రింద నేను మరియు TRS పార్టీ శ్రేణులు కలసి ఈ రోజు వారి కుటుంబానికి 1లక్షా మూడు వేల రూపాయలను అందజేయడం జరిగిందని అన్నారు.ఎండ్ర బాబు చెల్లె ఎండ్ర ఆకాంక్ష చదువుల విషయంలో కూడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్న ఆమెకు పై చదువు కొరకు అన్ని విదాల సహాయ సహాకారాలు ఆందిస్తామని అన్నారు .