తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు
ఇల్లంతకుంట,మండలంలోని అనంతరం
గ్రామంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇల్లంతకుంట సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చల్ల నారాయణ
ఈ సందర్భంగా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చల్ల నారాయణ మాట్లాడుతూ
ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అని అన్నారు,
ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్తారు,ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తారు,
హెల్త్ ప్రొఫైల్ లో వ్యక్తి యొక్క సమస్త ఆరోగ్య సమాచారాన్ని పొందు పరుస్తారు, హెల్త్ ప్రొఫైల్ ఆదర్శం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తీగల పిష్పాలత ,ఉపసర్పంచ్ శ్యామ్, వార్డ్ సభ్యులు మచ్చ ప్రభాకర్, సింగరి శ్రీనివాస్,ధారవేణి పర్శరం, చొప్పరి సతవ్వ ఎల్లయ్య,గొనపెళ్లి లావణ్య వెంకటేష్,మచ్చ లక్ష్మీ ,చొప్పరి మంజుల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి,నాయకులు గరిగే లక్ష్మణ్,వికృతి రవి,శ్రీను గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .