పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట, తీవ్ర గాయాలపాలైన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
నేడు పెరుగుతున్న ధరలు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టిపిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మానకొండూరు నియోజకవర్గంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీయడంతో, కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మోకాలు వద్ద తీవ్ర గాయాలయ్యాయి, దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సత్యనారాయణ గారిని వెంటనే కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది.