ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్టి రెడ్డి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల తహసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఇట్టి రెడ్డి లక్ష్మా రెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేయడం వెనక మహా కుట్ర దాగి ఉందని పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర లేకుండా తక్కువ ధరకే బ్రోకర్లకు అమ్ముకునేల రైతులకు అనివార్య పరిస్థితులు సృష్టిస్తూ కేసీఆర్ బ్రోకర్ లతో కలిసి పెద్ద పన్నాగాం పన్నారని అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముసివేయడం జరుగుతుంది అని ప్రకటించారని తెలిపారు దీన్ని కప్పిపుచ్చడానికి కేంద్రాన్ని బదనాం చేస్తూ కేంద్రం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు 1960 రూపాయలు మద్దతు ధర ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రలను తెరువక పోవడం తో రైతులు మిల్లర్ల వద్దకు వెళ్తున్నారని దీంతో మిల్లర్ల దోపిడీ ఎక్కువ అవుతుందని రైతులకు మద్దతు ధర కాకుండా క్వింటల్ కు 1300 నుంచి 1660 చెల్లిస్తున్నారని తద్వారా రైతులు300 వందల నుంచి 600 రూపాయల వరకు నష్టపోతారు. ఈసారి యాసంగి లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని కనీస మద్దతు ధర లేక రైతులకు వందల కోట్లలో నష్టం జరుగుతుందని దీనితో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైకి రాకుండా వందల కోట్ల రూపాయల కమిషన్ గురించి బయట పడకుండా తప్పుడు సమాచారం, తప్పుడు ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ దీక్షలు చేస్తూ కేంద్రాన్ని బధానం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ ఏర్పాడిన నుంచి ఈ ఏడాది ఖరీఫ్లో 97 వేల 375 కోట్ల చూపించిందని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతు పండించిన పంటను బియ్యం గా మార్చే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ఆదుకుంటూ రైతు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం గా మార్చే ఇచ్చినందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలను చెల్లిస్తుందని తెలిపారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిషన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి తూముల దేవరాజు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారం శ్రావణ్, దళిత మోర్చ మండల ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, సామ రమణ రెడ్డి,కొమ్ముల ప్రశాంత్ రెడ్డి, పొన్నవేని అజయ్,యాళ్ల అఖిల్, యాళ్ల రాజేందర్ రైతులు తునికి చందు,మచ్చ మల్లయ్య,సిరవేణి ప్రశాంత్,బద్దం అరుణ్ రెడ్డి,సామ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.