ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి

0
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
 ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి 
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి అయ్యేలా చూడడమే  సీఎం కేసీఆర్   లక్ష్యమని  ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి  అన్నారు,  మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయిబాలకిషన్  ఆదేశాల మేరకు  సోమవారం ఇల్లంతకుంట మండల పరిధిలోని గొల్లపల్లిలో DCMS ఆధ్వర్యంలో నిర్వహింస్తున్న వరి ధాన్యం కొనుగోల కేంద్రాన్ని ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం  కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ చల్లా నవీన్ రెడ్డి,మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కడగండ్ల తిరుపతి,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పత్రి అంజయ్య, AO రవళి,పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్, హమ్మలి సంఘ అధ్యక్షుడు ఒరుపుల రాములు, సీనియర్ నాయకులు ఒరుపుల రామస్వామి, ఎద్దు శంకరయ్య, కొమురయ్య, పున్ని సంపత్, రాజు, ఎద్దు కనకయ్య, మల్లయ్య, బొప్పెన బాలయ్య నవీన్, లక్ష్మణ్ రాజు DCMS ఇంచార్జి శ్రీకాంత్ పరశురాముడు  రైతులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top