కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం

0


ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ,అనంతగిరి,జంగంరెడ్డి పల్లె,ఇల్లంతకుంట గ్రామాలలో సుమారు 10లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మీ చెక్కులు సుమారు 5లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసారు,అనంతరం రసమయి మాట్లాడుతూ మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని రసమయి అన్నారు.కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది.
నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపం లో  రాజన్న సిరిసిల్లా జిల్లా బ్యాండ్ అసోసియేషన్  అధ్యక్షుడు సలీం ప్రమాణస్వీకరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం రజకులకు మరియు నాయి బ్రాహ్మణులకు ఉచిత  విద్యుత్ మీటర్లను పంఫణీ చేసినారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top