ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పి వైస్ చైర్మేన్ , ఎంపీపీ
న్యూస్ , 11 ఆగస్టు, ఇల్లంతకుంట :
ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న రాజన్న సిరిసిల్లా జిల్లా జెడ్పి వైస్ చైర్మేన్ సిద్దం వేణు, ఎంపీపీ వూట్కూరి వెంకట రమణా రెడ్డి,75వ,స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం ఇల్లంతకుంట మండలంలో ఏస్ ఐ మామిడి మహేందర్ నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో వారు పాల్గొన్నారు,
ఇల్లంతకుంట మండలంలోని కేరళా మోడల్ స్కూల్ నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి జాతీయ జెండాను చేతపట్టుకొని బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ బస్టాండ్ వరకు ఫ్రీడం రన్ నిర్వహించారు,
అనంతరం వారు మాట్లాడుతూ_
_ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏస్ ఐ మామిడి మహేందర్ మరియు జిల్లా పోలీష్ శాఖ ఆద్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి కేటీఆర్ మరియు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమంలో భాగంగ ప్రీడమ్ రన్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు,
_ప్రజలు, క్రీడకారులు రోజు వారి జీవితంలో శారీరక శ్రమలు మరియు క్రీడలు భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలు, క్రీడాకారులు ఫిట్ గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైందన్నారు,
ప్రస్తుతం పరిస్థితులలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆరోగ్యంగా ఉండటానకి తప్పనిసరిగా వాకింగ్, వీలైతే కోద్దిదూరం పరుగేత్తడం వల్లన రోగ నిరోదక శక్తిని పెంచుకోవటానికి ఈ ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ ను ప్రజల అవగాహన కోసం నిర్వహిస్తున్నామని అన్నారు..తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అదేశాల మేరకు క్రీడల ప్రోత్సాహనికి ప్రభుత్వం పేద్దపీఠ వేసిందన్నారు,
క్రీడాకారులను ప్రోత్సహించటానికి ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లును అమలు చేస్తున్నామన్నారు,
రాష్ట్రంలో క్రీడల అభివృద్ది కి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా పాలసీ ని ప్రకటించారని, తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు,
వారితో పాటు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ ,EX ఎంపీపీగుడిసె ఐలయ్య, తహశీల్దార్ స్వాతి, ఎంపివో రాజు,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు D సాదుల్,మండల వైద్యాధికారి కట్ట రమేష్, కస్తూర్భ,DT వినయ్,ASI మోతీ రాం,పోలీష్ శాఖ సిబ్బంది మరియు అన్ని శాల సిబ్బంది,అన్నిజడ్పీ. హెచ్.ఎస్ హైస్కూలు, కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు,నాయకులు బుర్ర సూర్యగౌడ్,మహేశ్, తదితరులు పాల్గొన్నారు.