సెలుకలకెల్లి చెక్కులు పంఫణి చేసిన రసమయి

0

 సెలుకలకెల్లి చెక్కులు పంఫణి చేసిన రసమయి

 న్యూస్, 13 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి,జవారిపేట,నర్సక్కపేట గ్రామాలలో సుమారు 13లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మీ చెక్కులు సుమారు 4లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసారు,
నర్సక్కపేట గ్రామంలో రైతు  పొలం దగ్గర పనులు చేసుకుంటుండగా నేరుగ రసమయి అన్న పొలం దగ్గరకి వెల్లి చెక్కు పంఫణి చేసినాడు,
అనంతరం రసమయి మాట్లాడుతూ మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని రసమయి అన్నారు.కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది అని అన్నారు,
నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116/-రూ!!ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top