సెస్ ఎలక్షన్లలో అత్యధిక డైరెక్టర్లు గెలిపించుకోవాలి
జనం న్యూస్ , 22 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున రాబోయే సెస్ ఎలక్షన్లలో అత్యధిక డైరెక్టర్లు గెలిపించుకుని సిరిసిల్ల సెస్ పైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం నుండి రిజర్వేషన్ ఏది వచ్చిన ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున డైరెక్టర్లు గెలిపించుకొని ప్రజల ఆశీర్వాదంతో వస్తామని దీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పసుల వెంకటి బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం ఎస్సీ సెల్ అధ్యక్షులు బడుగు లింగం మండల మహిళా అధ్యక్షురాలు అయ్యన్న గారి సత్య రెడ్డి , ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.