రైతు వేదిక భవనం, కల్లాల నిర్మాణనికి భూమి పూజ: పాల్గొన్న ఎమ్మల్యే రసమయి బాలకిషన్
- రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రాజన్న సిరిసిల్ల/ ఇల్లంతకుంట ( అక్షరం న్యూస్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పర్యటనలో భాగంగా మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ మండలం లోని సోమారంపేట, ఇల్లంతకుంట, అనంతారం, పెద్ద లింగాపూర్, దాచారం గ్రామాలలో రైతు వేదికలు, కళ్లాలకు, గ్రామ వారసంత ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో మద్య మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ లు ఉండటం వలన ప్రతి ఎకరానికి సాగునీరు అందించడంలో లక్ష్యాన్ని నెరవేర్చుటకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు త్రాగు నీరు, సాగునీరు లేకుండా కరువు ప్రాంతంగా ఉన్న మండలంలో రిజర్వాయర్ ల ద్వారా వివిధ గ్రామాలలోని చెరువులు నిండుగా ఉన్నాయని తెలిపారు. కాగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక మార్పులు రావాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర పొంది సంపన్నులు కావాలని ఉద్దేశ్యంతో అన్ని గ్రామాలలో వివిధ పంటల సాగుకు అనువైన భూసార పరీక్షలు చేసి, ప్రతి క్లస్టర్ కి ఒక రైతు వేదిక నిర్మించాలని సిఎం కేసిర్ నిర్ణయించారని అందులో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామన్నారు. రానున్న రెండు నెలలో నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మెన్ సిద్దం వేణు, ఎం.పి.పి ఉట్కూరి వెంకట రమణ రెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె అయిలయ్య, మండల టి ఆర్ స్ అధ్యక్షులు గొడుగు తిరుపతి, ప్యాక్స్ చైర్మేన్ లు రొండ్ల తిరుపతి రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మెన్ వేణు రావు, వైస్ ఎం.పి.పి శ్రీనాథ్ గౌడ్, రైతు బందు సమితి మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఎంపిడివో విజయ, తహశిల్దార్ రాజు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు చల్ల నారాయణ, ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు యం డి సాధుల్, వ్యవసాయ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
-ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అడ్డగించి నిరసన
పర్యటనలో భాగంగా మండలలోని దాచారం గ్రామంలో రైతు వేదిక నిర్మాణ భూమి పూజ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే ను కొంతమంది గ్రామ ప్రజలు అడ్డగించి ఇప్పటి వరకు తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, అర్హులకు డబుల్ బెడ్ రూం నిర్మాణాలు జరగలేదని నిరసన తెలిపారు.