రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి దళిత మోర్చా మండల శాఖ ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

0
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి దళిత మోర్చా మండల శాఖ ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్  ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘానా నివాళులర్పించారు. అనంతరం బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ మానవతా విలువలు ఉన్నతమైన అటువంటి ఆదర్శాలు కలిగిన రామాయణ మహా కావ్యాన్ని వాల్మీకి గారు లిఖించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రామాయణాన్ని రాచించిన వాల్మీకి దేశంలోనే కాకుండా ప్రంపంచ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అదర్శంగా నిలిచిన మహవ్యక్తి మహర్షి అయ్యాడన్నారు. గొప్పవారి జయంతి వేడుకలను నిర్వహించడామే కాదని, ఆయా వ్యక్తులు జీవితాంతం ఏ విలువలకైతే పాటుపడ్డారో వాటిని గుర్తుంచుకుని ఆచరించడం ఉత్సవాల ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చనడానికి వాల్మీకి జీవితమే ఒక సందేశమని వారు పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా రాజుగా దేశ ప్రజలను ఎలా పరిపాలించాలో పూర్తిగా తెలియజేయడమైనదన్నారు. రామాయణ కావ్యాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలలో కూడా చాలామంది రాముడిని ఆదర్శంగా తీసుకుని పాలనను, కుటుంబ వ్యవస్థను సన్మార్గంలో ఉండేలా ఆదర్శ జీవితం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు కమల ఎల్లేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారం శ్రావణ్, దళిత మోర్చ మండల ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్,ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి వజ్జెపల్లె శ్రీకాంత్,సో ల్లు ప్రశాంత్, దుబ్బ చింటూ,గొఱ్ఱె డిక్కీ,పున్ని ప్రశాంత్,తుమ్మ నవీన్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top