అనంతగిరి లో శ్రీదేవి, భూదేవి సమేత,నాభి శిల ప్రతిష్టా కొరకు గ్రామ ప్రజల సమావేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం.ఈ రోజు అనంతగిరి గ్రామం లో గ్రామ సర్పంచ్ పల్లే నర్సింహ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశం లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామం లో ఏర్పాటు చేసుకో బోయే శ్రీదేవి, భూదేవి, సమేత నాభిశిల ప్రతిష్టా కార్యక్రమం గురించి చర్చ చేసుకున్నారు. తేదీ 08-11-2021 నుంచి కార్యక్రమాలు ప్రారంబం అయి ఐదు రోజుల పాటు కొనసాగుతుందని,అందులో 11-11- 2021 రోజు 10:35 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమం ఉంటుందని ఇట్టి కార్యక్రమంలో చివరి రోజు శ్రీ దేవీ,భూదేవి సమేత నాభి శిల కు మట్టి కుండ లో బోనాలు,తరువాత శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి కి పెద్ద పట్నం బోనాల పండుగ తో ఈ కార్యక్రమం ముగుస్తుంది అని అన్ని వివరాలు చర్చించు కున్నరు. ఈ సమావేశం ద్వారా గ్రామ సర్పంచ్ పల్లె నర్సింహ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు,మండల ప్రజలకు తేదీ 08-10-2021 నుంచి 11-10-2021 వరకు గ్రామం లో మద్యపానం,మాంస హరం నిషేదించుతున్నమని,మండలం లో వివిధ గ్రామాల నుంచి వచ్చే ముత్యాల పోచమ్మ భక్తులు ఆ నాలుగు రోజుల అమ్మ వారి మొక్కులు కొబ్బరి కాయతో మాత్రమే ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా MPTC గొట్టిపర్తి పర్శరాములు గౌడ్,నాయకులు,గ్రామ పెద్దలు సత్యనారాయణ రెడ్డి, లింగా రెడ్డి, ముత్యం రెడ్డి,కొమురయ్య,గోపాల్,బాల గౌడ్,అంజయ్య,
లచయ్య,నరేష్,కిషన్, ఇంకా గ్రామం లో అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.