అంతగిరి పోచమ్మ తల్లిని దర్శించుకున్న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని మహిమగల అంతగిరి పోచమ్మ తల్లి దర్శించుకుని ముడుపులు చెల్లించిన రాష్ట్ర బిజెపి నాయకురాలు మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి నాగ షర్మిల, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పెర శ్యామల, శ్రీమతి డా|| పోతుగంటి సుజాత రెడ్డి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి సామ్రాజ్యలక్ష్మీ లు అనంతగిరి పోచమ్మ తల్లిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నియంతల పాలనలో నలిగిపోతున్నదని తెలంగాణ ప్రజానీకానికి న్యాయం జరగడం లేదని తెలంగాణ మహిళలపై జరుగుతున్న అటువంటి అత్యాచారాలను అకృత్యాలను నిరోధించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుటకై ఎందరో అమర వీరులు తమ ప్రాణాలను అర్పించిన ఇవాళ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ పాలనలో చిన్నాభిన్నమైన తెలంగాణ గా మారిందన్నారు. యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగుల రోడ్లపై తిరుగుతున్నారని కొందరు యువత ఉద్యోగాలు రాక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ పాపం కేసీఆర్ కుటుంబానికి తగులుతుందని అన్నారు. కెసిఆర్ ఎన్ని కుళ్లు కుతంత్రాల రాజకీయాలు చేసినా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ అన్న బీజేపీ జెండా ఎగరడం ఖాయం అయిపోయిందని ఈ గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వం గద్ద తీయడం ఖాయమని తెలిపారు. ముత్యాల పోచమ్మ అమ్మ వారి ఆశీస్సులతో ఈటెల రాజేందర్ అన్న గెలుపు ఖాయమని తెలిపారు. పోచమ్మ తల్లి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మరియు రాజేందర్ అన్న పై ఉండాలని ప్రత్యేక పూజలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు పిట్టల అశ్విని, మహిళా మోర్చా నాయకురాలు ముత్తక్క మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, బిజెపి సీనియర్ నాయకులు తిప్పర వేని బాలకిషన్, బిజెపి ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రావణ్, బిజెపి ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి వజ్జేపల్లి శ్రీకాంత్, దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్, నాయకులు సొల్లు ప్రశాంత్, అంతటి వేణు, తదితరులు పాల్గొన్నారు.