చిన్నారి ఘటనపై సభ్య సమాజం సిగ్గు పడాలి
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితున్ని చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ అద్యక్షుడు పసుల వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ టిఆర్ ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిది ఓ అభం శుభం ఎరుగని ఆరేండ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డ ఇప్పటికి నిందితున్ని శిక్షించక పోవడం బాధా కరమన్నారు. రాష్ట్రములో నున్న ప్రజలందరూ తల దించుకునేలా జరిగిన ఘటనను ముక్త కంఠముతో ఖండించాలని పేర్కొన్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, ఎక్కడ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.